(మెట్రో న్యూస్):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.రూ. 150 కోట్లతో విద్యుత్ వసతులు: అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో విద్యుత్ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో రూ. 53.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/30 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.నియోజకవర్గంలో విద్యుత్ వినియోగం, డిమాండ్‌పై సమీక్షించిన డిప్యూటీ సీఎం, రైతులకు మరియు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల నిరంతరాయ విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు.
ఎల్ నివో సిబ్బంది అలర్ట్ విద్యుత్ లో వోల్టేజ్ లేదా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.