Take a fresh look at your lifestyle.

సీఎంకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన హైక‌మాండ్‌

0 26

(మెట్రో న్యూస్ బ్యూరో):

టీ-కాంగ్రెస్ లెజెండ్ రేవంత్  పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ ఎనుముల మాటే ఫైన‌ల్‌!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎనుముల రేవంత్ రెడ్డి పొజిష‌న్ మ‌రింత బ‌లోపేత‌మైంది. ఇటీవ‌ల ప‌రిణామాల‌ను ఆయ‌న చ‌క్క‌బెట్టిన తీరు… ప్ర‌ద‌ర్శించిన చాణక్య‌నీతి నెక్స్ట్ లెవల్లో ఉంది. మంత్రి కొండా సురేఖ‌, మాజీ మంత్రి చిన్నారెడ్డి వివాదాన్ని రేవంత్ త‌న‌దైన శైలిలో డీల్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి రావాలంటే… త‌న మాటను గౌర‌వించాల్సిందేన‌ని అధిష్టానానికి విశ‌దీక‌రించి చెప్పారు. పార్టీ లైను దాటిన వారిని ప్రోత్స‌హిస్తే… జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు తాను బాధ్యుడిని కాద‌ని సుస్ప‌ష్టం చేశారు. అస‌లే దేశ‌వ్యాప్తంగా పార్టీ తేరుకోవ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్న కాంగ్రెస్… తెలంగాణ‌లో అస‌మ్మ‌తి రాజ‌కీయాల‌ను, గ్రూపు త‌గాదాల‌ను ప్రోత్స‌హించే రిస్క్ తీసుకోలేదు. స‌రిగ్గా ఇదే పాయింట్ మీద రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రేనేత‌ల‌ను త‌న వాద‌న‌తో క‌న్విన్స్ చేశారు. కొంద‌రు దానిని బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ అనుకున్నా ఫ‌ర్వాలేదు! ఆయ‌న మాట చెల్లుబాటు అయ్యిందా లేదా … బుల్లెట్ దిగిందా లేదా అన్న‌దే ముఖ్యం!

రేవంత్ రెడ్డి స‌ర్కారు కొలువుదీరి అప్పుడే స‌గం టెర్మ్ ముగిసింది. మిగిలింది రెండున్న‌రేళ్లే. ఈ ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి వ్య‌తిరేక గ‌ళాల‌ను ప్రోత్స‌హిస్తే లాభం క‌న్నా న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని ఏఐసీసీ సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ అర్థం చేసుకున్నారు. ఆయ‌నే ఈ విష‌యంలో అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌కు న‌చ్చ‌జెప్పార‌ని తెలుస్తోంది. ఇపుడు క్ర‌మశిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోకుండా వ‌దిలిపెడితే… మ‌రికొంద‌రు మంత్రులు, మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు గ్రూపులు క‌ట్టి… ప్ర‌భుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టే ప‌రిస్థితి త‌లెత్త‌వ‌చ్చ‌ని హైక‌మాండ్ భావించింది. బీసీ మ‌హిళా మంత్రితోపాటు రెడ్డి సామాజిక మాజీ మంత్రికి సైతం ఉద్వాస‌న ప‌లికి… పార్టీ లైను దాటితే… ఎంత పెద్ద వారైనా… ఏ సామాజిక వర్గం వారైనా ఉపేక్షించేది లేద‌న్న బ‌ల‌మైన సంకేతాల‌ను పంపించింది.

ఈ ప‌రిణామాల త‌ర్వాత స‌హ‌జంగానే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అటు పార్టీలోనూ, ఇటు ప్ర‌భుత్వంలోనూ స్ట్రాంగ్ అయ్యారు. ఒకే ఒక్క‌డు త‌ర‌హాలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆవిర్భ‌వించారు. అచ్చ‌కాంగ్రెస్‌, ప‌చ్చ కాంగ్రెస్ అంటూ విభేదాలు సృష్టించేందుకు ప్ర‌య‌త్నించిన వారికి ఇదో హెచ్చ‌రిక‌! అస‌లే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ… ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. కేసీఆర్ ఇంకా బ‌య‌ట‌కు వ‌స్తే ప‌రిస్థితి ఏంట‌నే అంచ‌నా కాంగ్రెస్ హైక‌మాండ్‌కు లేక‌పోలేదు! అందుకే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అనంత‌రం జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్న లెజెండ్ రేవంత్ రెడ్డికి అండ‌గా నిలిచింది. అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్‌ను ఘాటుగా విమ‌ర్శిస్తూ… కాంగ్రెస్ శ్రేణుల‌లో జోష్ నింపుతున్న రేవంత్ రెడ్డితో పాత‌, కొత్త అనే తేడాలేకుండా అంద‌రూ క‌లిసి న‌డిచే ప‌రిస్థితి అనివార్యమ‌వుతోంది.

Leave A Reply

Your email address will not be published.