రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లోద్వితీయ స్థానంలో నిలిచిన ఖమ్మం జిల్లా బాలికల జట్టుకు అభినందన*
మెట్రో ఈవెనింగ్:
ఈనెల రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో జరిగిన సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన ఖమ్మం జిల్లా జట్టును రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవలే మంత్రి పొంగులేటి తరఫున క్రీడాకారులకు జెర్సీలు అందజేశామని, బాలికలు ఈ విజయాన్ని అందుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ క్రిస్టఫర్ బాబును, క్రీడాకారులను సత్కరించారు.