మన్ననూర్‌లో 220/30 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
(మెట్రో న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో సుమారుగా 53.78 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 220/30 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో సిఎండి కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి చెన్నయ్య, దేవ సహాయం, విద్యుత్ శాఖ డైరెక్టర్ ఆపరేషన్ నరసింహ, గ్రామ సర్పంచ్ మంజుల, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.