(మెట్రో న్యూస్):
నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్,అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ రెవిన్యూ బి చెన్నయ్య, బుధవారం అచ్చంపేటనియోజకవర్గంలోని మన్ననూర్ గ్రామంలో పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.ఉప ముఖ్యమంత్రి మన్ననూర్‌కు చేరుకున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపముఖ్యమంత్రి కి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన్ననూర్‌కు చేరుకున్నారు.