Take a fresh look at your lifestyle.

50 అడుగుల రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం

0 17

మెట్రో న్యూస్:

ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయంగా మెదక్ పట్టణంలోని 9వ వార్డులో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న 50 అడుగుల ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు శుక్రవారం 9వ వార్డు కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ నేతృత్వంలో మున్సిపల్ చైర్మన్ రాధిక వైస్ చైర్మన్ నరేష్ గౌడ్లు పనులు ప్రారంభించడం పట్ల కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రహదారి అభివృద్ధి పనులు ప్రారంభం కావడం 9వ వార్డు ప్రజలతో పాటు మెదక్ పట్టణ ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఒకటిగా ఉన్న 9వ వార్డు 50 అడుగుల రహదారి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించిన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు జుబేర్ అహ్మద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో, సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ, 9వ వార్డులోని ఈ ప్రధాన రహదారి పరిసర ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు అధికంగా ఉన్నందున ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని, రహదారి అభివృద్ధి పూర్తయితే వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు, రోగులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.ఈ 50 అడుగుల ప్రధాన రహదారి కేవలం 9వ వార్డు ప్రజలకే పరిమితం కాకుండా మెదక్ పట్టణంలోని అనేక ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. రహదారి అభివృద్ధి పూర్తయిన తర్వాత రాకపోకలు మరింత సులభతరం అవుతుందని అన్నారు

Leave A Reply

Your email address will not be published.