Take a fresh look at your lifestyle.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు సర్పంచ్ అమరబోయిన మట్టయ్య

0 31

మెట్రో న్యూస్:

మునగాల:అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని సర్పంచ్ అమరబోయిన మట్టయ్య అన్నారు.
శుక్రవారం మండల పరిధిలోని గణపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాలుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రీవర్యులు‌ కెప్టెన్ యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే యన్ పద్మావతి రెడ్డి సహకారంతో త్వరలో మిగిలిన లబ్ధిదారులకు కూడా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పి, మైబ్ సైదులు, గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు సభ్యులు సురపల్లి రమేష్,కార్యదర్శి దొంగరి సైదులు, పార్టీ నాయకులు నజీర్,యం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.