Take a fresh look at your lifestyle.

Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా – చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం… వయలెంట్ శుక్రాచార్య వార్

0 14

Mahankali Glimpse : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి పవర్ ఫుల్ మహాకాళి గ్లింప్స్ వచ్చేసింది. చెడును అంతం చేసే రౌద్ర రూపంలో భద్రకాళీ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది.

Prasanth Varma Mahakali Glimpse Out Now Bhoomi Shetty Sriya Reddy Akshaye Khanna Shukracharya War Cry Video Telugu Review Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్

Prasanth Varma’s Mahakali Glimpse Review : ఫస్ట్ మూవీ ‘హను మాన్’తోనే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు రాబోతున్నాయి. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతోన్న మరో పవర్ ఫుల్ మైథలాజికల్ ఎపిక్ ‘మహాకాళి’ (Mahankali). ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన లుక్స్, పోస్టర్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా అది పదింతలు చేసేలా గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

మహాకాళి గ్లింప్స్ రివ్యూ 

ఇండియన్ సినిమాలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ ‘మహాకాళి’. చెడును అంతం చేసే రౌద్ర రూపం. అందుకు తగ్గట్లుగానే నల్లని రంగు ముఖం, ముక్కు పుడక, ఉగ్ర రూపంలో మహా దేవతను కళ్లకు కట్టేలా కాళికా దేవిని ప్రెజెంట్ చేశారు ప్రశాంత్ వర్మ. ‘శుక్రాచార్య వార్ క్రై’ (Shukracharya War Cry) పేరుతో రిలీజ్ చేసిన ఫస్ట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

అమ్మవారి ఆలయంలో ఓ పసిబిడ్డను వదిలేయడంతో ప్రారంభమైన వీడియో… రాక్షసులకు రాజగురువైన శుక్రాచార్యుని తపస్సుతో వేరే లోకానికి తీసుకెళ్తుంది. క్షీర సాగర మథనం టైంలో అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా చేసి… రాక్షస జాతిని అంతం చేసిన శ్రీ మహావిష్ణువుపై ఆగ్రహంతో ఉన్న శుక్రాచార్యుడు (అక్షయ్ ఖన్నా)… 14 రోజుల్లో ‘అసుర విజయ ఘోష’ సమస్త బ్రహ్మాండ దినమున ప్రతిధ్వనిస్తుందంటూ ప్రతిజ్ఞ చేస్తాడు. మరి దీని కోసం శుక్రాచార్యుడు ఏం చేశాడు? అనేది సస్పెన్స్.

రౌద్ర రూపం… శాంత స్వరూపం

అమ్మవారి రూపాల్లో మోస్ట్ వయలెంట్ రోల్ భద్రకాళిని క్లైమాక్స్‌లో రౌద్ర రూపంతోనే పసి బిడ్డను లాలిస్తున్న శాంత స్వరూపిణిగా చూపించడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహాకాళి ఎత్తుకున్న ఆ బిడ్డ ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఈ మూవీకి ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, స్టోరీ అందిస్తుండగా… పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ రోల్ మహాకాళి పాత్రలో భూమిశెట్టి నటిస్తుండగా… హీరోయిన్ శ్రియా రెడ్డి మోస్ట్ వయలెంట్ రోల్‌లో నటిస్తున్నారు. వీరితో పాటే శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్, మురళీ శర్మ, సముద్రఖని నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

Leave A Reply

Your email address will not be published.