అప్లయ్ చేసుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి లేదంటే సింగరేణి గేటు ఎదుటే ఆమరణ దీక్ష టీఆర్ఎస్ చీఫ్ కవిత హెచ్చరిక
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
మెడికల్ బోర్డుకు అప్లయ్ చేసుకున్న వారందరినీ అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. రెండు నెలల పాటు వేచి చూస్తాం. ఇప్పటి నుంచి మెడికల్ బోర్డులో అన్ ఫిట్ 80 శాతానికి చేరాలి. లేదంటే సింగరేణి భవన్ గేటు ముందే ఆమరణ దీక్ష చేస్తాం అని హెచ్చరించారు.
సోమవారం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి కవిత సింగరేణి భవన్ ముట్టడించారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తాం అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోందన్నారు. సీఎండీ వచ్చి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కు. అది మీరు వేసే బిచ్చం కాదన్నారు. అలియాస్ పేర్లు ఉన్న కార్మికులను విజిలెన్స్ పేరుతో వేధించవద్దు. కార్మికులను వేధిస్తూ అక్రమంగా ఉద్యోగాలు తొలగించిన వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.