Take a fresh look at your lifestyle.

సుప్రీం కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నా… దానం నాగేంద‌ర్ స్పంద‌న‌

0 26

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

సుప్రీం కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్న‌ట్టు ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గురువారం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా దానం మీడియాతో మాట్లాడుతూ… పై విధంగా స్పందించారు. ప్రజాక్షేత్రంలో త‌న‌కు బ‌లం ఉంద‌ని, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు త‌న‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని అన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ప్ర‌తి ఇంటికి తాను సేవ చేశాన‌ని, ప్ర‌జ‌ల‌ను అడిగితే వాళ్లే త‌న ప‌నితీరును చెబుతార‌న్నారు. గ‌తంలో మూడు సార్లు గెలిచాన‌ని, ఒక‌సారి కేవ‌లం 1600 ఓట్ల తేడాతో ఓట‌మి పొందాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.