రైతన్నకు సమృద్ధి సూర్యాపేటకు సుభిక్షమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.
సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. వరుణ యాగం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెలిదే శ్రీనివాసులు, ఎలుగూరి రాంబాబు గౌడ్, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.