Take a fresh look at your lifestyle.

ఆర్మూర్ అభివృద్ధి రాకేష్ రెడ్డి తోటే సాధ్యం – బిజెపి నాయకులు

0 22

( మెట్రో న్యూస్ ):

చిల్లర రాజకీయం మానుకోవాలి అభివృద్ధి కి సహకరించండి అని ఆర్మూర్ నియోజకవర్గం బిజెపి నాయకులు మీడియా సమావేశంలో కోరడం జరిగింది, శనివారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఇటీవల రెండు పడక గదుల పంపిణీ కార్యక్రమం జరిగాయని అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆర్మూర్ లో నిందలు వేస్తున్నాయని ప్రతిదీ అధికారుల సమక్షంలో మాత్రమే జరిగిందని కేంద్రం నుంచి నిధులు రావడం అదే చివరి రోజు అని అందుకే కొంతమంది లబ్ధిదారులకైన ప్రయోజనం చేకూరాలని ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని మంత్రిని ఒప్పించి ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యేకు అభినందనలు తెలపాల్సింది పోయి నిందలు వేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అలాగే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ కార్యాలయం ఇంటిగ్రేట్ రెవెన్యూ కార్యాలయం ఒకే చోటు ఉండటం వల్ల ప్రజలకు వేసులుబాటు అవుతుందని ఎమ్మెల్యే అభివృద్ధి లో రాజకీయాలకతీతంగా నాయకులను కలుస్తూ నిధులు మంజూరయ్యే విధంగా చూస్తున్నాడని దమ్ముంటే నిధులు తేవాలి కానీ వచ్చిన నిధులను ఆపే విధంగా చూడడమే ఉందని పట్టణానికి మధ్యలో మున్సిపల్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కార్యాలయం ఉండాలని మార్కెట్ పట్టణ శివారులో ఉంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నాయకులన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం రాజకీయ పబ్బం కోసం మాత్రమే మాట్లాడుతున్నారని అవినీతి పనులు కాంగ్రెస్ నాయకులకు అలవాటని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, నూతన శ్రీనివాస్ రెడ్డి, పుల్కం వేణు, వివేక్, కలిగోడు గంగాధర్ ఉదయ్ గౌడ్ కలిగొట్ ప్రశాంత్, ఆకుల రాజు కౌన్సిలర్లు యామాద్రి భాస్కర్, బొట్టు రాజు, పాన్ శీను, అరుణ్, దొండిశ్వర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.