మెట్రో న్యూస్
బాన్సువాడ నియోజకవర్గంలో అక్టోబర్ 27వ తేదీ మంగళవారం రోజున పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క బాన్సువాడకు రానున్నారు.
మంత్రి సీతక్క పర్యటనకు సంబంధించి బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు, మధ్యాహ్నం 2 గంటలకు బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ.
మధ్యాహ్నం 3 గంటలకు బాన్సువాడ పట్టణంలో: పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం.
మధ్యాహ్నం 3:30 గంటలకు బోర్లం గ్రామ శివారులో: బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం.
ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో చేపట్టి విజయవంతం చేయాలని శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.