Take a fresh look at your lifestyle.

22 ఏ పై ప్రభుత్వ జీఓ

0 20

మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు  , మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితులకు అనుసంధానమై ఉన్న గ్రామాల పరిధిలోని భూముల కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల  విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది.

G.O.134 -Committee_Lands_Enquiry (2)

ఈ ఉన్నత స్థాయి కమిటీకి సాంకేతిక, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన  చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు  కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా   సభ్యుడిగా, ఏ జిల్లాకు చెందిన భూములపై విచారణ జరుగుతుందో ఆ జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.