Take a fresh look at your lifestyle.

సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దాం

0 5

నవీపేట్ మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీలో శనివారం సిపిఎం పార్టీ అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్. మండల నాయకులు దేవేందర్ సింగ్ లు మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి ఉద్యమం నుండి ఎస్ఎఫ్ఐ లో చురుగ్గా పనిచేస్తూ మన తెలుగు బిడ్డగా ఉన్న ఏచూరి అఖిలభారత విద్యార్థి సంఘం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ కార్యదర్శి గాను పనిచేసి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని విద్యార్థుల ముందు నిలబెట్టిన వీరుడన్నారు.అంచలంచలుగా సిపిఎం పార్టీలో అఖిలభారత కార్యదర్శిగా ఎదిగి మూడుసార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న క్రమంలో రాజ్యసభలో తను మాట్లాడిన విధానము సభలో తన మాట్లాడిన శైలి అందర్నీ ఆకర్షించేవిధంగా ఉండేదాన్నారు.

ఈరోజు పార్లమెంట్లో గానీ ఇటు అసెంబ్లీలో గాని ప్రజా సమస్యలు చర్చించకుండా తమ స్వార్థం కోసం గలాటపడుతున్న సందర్భాలు చూస్తున్నామని అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సిపిఎం పార్టీ కమ్యూనిస్టుల సొత్తు అని అది ఏ పార్టీకి సంబంధించింది కాదని ఈరోజు బిజెపి లాంటి పార్టీలు విమోచనా దినం లాంటివి జరుపుతూ ఆనాటి సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హోంమంత్రి ఆయన ఆర్ఎస్ఎస్ ని నిషేధించిన వ్యక్తి అది కూడా గమనించుకోవాలని అన్నారు. పేదలందరికీ ఉపాధి విద్యా వైద్యం అందిన నాడే అసలైన ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజలకు భారం తగ్గుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు దేవేందర్ సింగ్. షేక్ మహబూబ్. పోగుల సావిత్రి. షమీం. ఖురేషి. పుష్ప కెవిపిఎస్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.