ముక్తిని ప్రసాదించే కాశీ విశ్వనాథుడి దివ్యధామం వారణాసి. ఆ దేవభూమిలో స్వామి దేవేరిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కొలువైంది విశాలాక్షి అమ్మవారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, సతీదేవి కర్ణాభరణాలు రాలిన పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అద్భుతమైన దక్షిణ భారత శైలి శిల్వకళ, నవరాత్రుల వైభవంతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లే ఈ ఆలయ విశేషాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిపి ఉండే క్షేత్రాలు చాలా అరుదు. అలాంటి వాటిల్లో కాశీ పుణ్యక్షేత్రం ఒకటి.
ఇక్కడ విశ్వనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుంటే, విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. విశాలాక్షి అనగా విశాలమైన నయనాలు కలది అని అర్థమొస్తుంది. తన నేత్రాలతో భక్తులను చూసి వాళ్ల కష్టాలను నేరవేర్చి, మనసులోని కోరికల్ని తీర్చే అమ్మవారు ఆమె. విశాలాక్షి అమ్మవారి టెంపులఉత్తర్ప్రదేశ్, వారణాసిలోని గంగానది ఒడ్డున, స్వామి సన్నిధికి పక్కన, మీర్ఘాట్కు దగ్గరగా ఉంటుంది. జగన్మాత కర్ణాభరణం ఈ ప్రదేశంతో పడిందని ప్రతీతి.
కాశీ విశాలాక్షి ఆలయం
ఓసారి దక్షప్రజాపతి యజ్ఞాన్ని తలపెట్టి, తన కూతురు సతీదేవిని, అల్లుడు శివుడిని పిలవలేదట. అయినా కూడా
ఆ యజ్ఞానికి వెళ్లిన సతీదేవి, తండ్రి నుంచి అవమానాన్ని ఎదుర్కొని, చివరకు అగ్నికి ఆహుతి అవడంతో, పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని ఉగ్రరూపుడై విలయతాండవం చేశాడట. ఆ కంపనకు సామాన్యులే కాక, దేవతలు కూడా తట్టుకోలేకపోయారట.
ఆ సమయంలో విష్ణుమÖర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తే, ఆ భాగాలన్నీ పలుచోట్ల పడి, శక్తిపీఠాలుగా మారాయి. వాటిలో అతి ప్రధానమైన పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా చెబుతారు. కాశీలో కొలువైన విశాలాక్షీదేవి ఆలయం అందులో ఒకటి. ఆవిధంగా వారణాసి అటు జ్యోతిర్లింగంతోపాటు ఇటు అష్టాదశ శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా వెలుగొందుతోంది.
ఉత్సవమÖర్తిని దర్శించుకున్నాకే!
కాశీకి వచ్చే భక్తులు విశ్వనాథుడిని, అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకుని మాత్రమే తిరిగి వెళ్తే కాశీ యాత్ర పూర్తవ్వదు. స్వామి టెంపుల్కు దగ్గరగా ఉండే విశాలాక్షి మందిరాన్ని కూడా సందర్శించినప్పుడే ఆ యాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది.
ఈ టెంపుల్ ఉత్తర భారత దేశంలోనే ఉన్నా, గోపురం మాత్రం దక్షిణాది నిర్మాణశైలిలో నిర్మించారు. ఆలయం లోపల చరిత్రకు సంబంధించిన కొన్ని తమిళ శాసనాలు ఉన్నాయి. విశాలాక్షి అమ్మవారి టెంపుల్
ను తమిళనాడుకు చెందిన నాట్టుకోటె్టౖ చెట్టియార్లు కొన్నేళ్ల కిందట పునర్నిర్మించి, అప్పటినుంచి కూడా నిర్వహణ బాధ్యతలనూ పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు గర్భాలయంలో రెండు విగ్రహాలు దర్శనమిస్తాయి. వాటిల్లో ముందున్నది ఆర్చామÖర్తి అయితే, వెనక ఉన్నది స్వయంభువు విగ్రహం. ముందుగా ఆర్చామÖర్తినే ఆరాధించి, తర్వాతే స్వయంభువును తిలకిస్తుంటారు భక్తులు. ఇక్కడ మరణించే ప్రతి జీవి చెవిలో శివుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడనేది ఓ నమ్మకమైతే, విశాలాక్షీదేవి తన కొంగుతో ఆ జీవులకు గాలి విసిరి, వారికి చివరి క్షణంలో ప్రశాంతతనూ, తర్వాత మోన్ని కూడా చేకూరుస్తుందని చెబుతుంటారు.
కాశీ విశాలాక్షి ఆలయం గ్రహదోషాలు తొలగిపోతాయి!
నార్త్ ఇండియాలోని టెంపుల్స్ లో నవగ్రహాలు ఉండటం అరుదు. ఈ పుణ్యక్షేత్రంలో వాటినీ చూడొచ్చు. అమ్మవారి దర్శనం అనంతరం, నవగ్రహాలను పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని ఓ నమ్మకం. ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారికి సమర్పించే కాటుకను పెట్టుకుంటే కంటి వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. అలాగే, రాత్రి టెంపుల్ తలుపులు క్లోజ్ చేశాక ముక్కోటి దేవతలు, మహర్షులూ వచ్చి అమ్మవారిని పూజిస్తారని, అందుకే మార్నింగ్ తలుపులు తీయగానే దివ్యమైన పరిమళం వస్తుందని అర్చకులు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఉండే ఈ టెంపుల్లో భాద్రపద మాసంలో ప్రత్యేక ఉత్సవాన్ని జరుపుతారు. ఇక శరన్నవరాత్రుల టైమ్ లో ఇక్కడ అంగరంగవైభవంగా జరిపే పూజల్ని చూసి తరించాల్సిందే.