Take a fresh look at your lifestyle.

పోలియో రహిత సమాజమే మన లక్ష్యం, డాక్టర్ డి రామారావు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి.

0 7

మెట్రో ఈవెనింగ్

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. రామారావు మాట్లాడుతూ పోలియో వ్యాధి నివారణపై ప్రజలలో అవగాహన కల్పించాలని, పోలియోవైరస్ వలన వ్యాపిస్తుందని, పోలియో ఒక ప్రమాదకరమైన వ్యాధి అని ఇది ముఖ్యంగా కలుషితమైన ఆహారము మరియు నీరు, పోలియో సోకిన వ్యక్తి మలము ద్వారా ఈ వైరస్ బయటకు వస్తుందని,చేతులు సరిగా కడుక్కోకపోవడం వల్ల లేదా పారిశుద్ధ్య లోపాలు ఉన్నప్పుడు ఈ వైరస్ ఆహారము,తాగునీటి ద్వారా ఇతరుల శరీరంలోకి నోటి ద్వారా ప్రవేశిస్తుందని ఇది ప్రధానంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలను ప్రభావితం చేసి, శాశ్వత పక్షవాతానికి గురిచేస్తుందని పేర్కొనడం జరిగింది.
పోలియో వ్యాధిని పూర్తిగా నివారించడానికి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు జాతీయ వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్ ప్రకారం పోలియో చుక్కలు, పోలియో టీకాలు వేయించడం అత్యంత ముఖ్యమైనదని పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , భారతదేశంలో 2011 నుంచి ఇంతవరకు ఒక్క పోలియోకేస్ కూడా నమోదు కాలేదని అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2007 సంవత్సరం తర్వాత నుంచి ఇంతవరకు ఒక కేసు పోలియో పాజిటివ్ నమోదు కాలేదని, పోలియోపై అపోహలను నమ్మకుండా ఆరోగ్య సిబ్బంది సూచనలు పాటించాలనితెలియపరిచారు

Leave A Reply

Your email address will not be published.