Take a fresh look at your lifestyle.

జూరాల ప్రాజెక్టు వ‌ద్ద ఉద్రిక్త‌త‌

0 19

     గ‌ద్వాల (మెట్రో న్యూస్‌):

  • బీఆర్ఎస్ నేత‌ల అరెస్టు
  • సాగునీరు ఇవ్వాల్సిందేన‌న్న
  • బీజేపీ ఎంపీ డీకే అరుణ‌

జూరాల ప్రాజెక్టు వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. రైతుల పంట‌పొలాల‌కు సాగునీరును వ‌ద‌లాల‌ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సోమ‌వారం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు వెళ్ల‌డంతో… పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీగా గులాబీ శ్రేణులు జూరాల సంద‌ర్శ‌న‌కు పిలుపునివ్వ‌డంతో… అక్క‌డ భారీగా పోలీసుల‌ను మొహ‌రించారు. బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌ను ప్రాజెక్టు వైపు వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకొని… అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు, బీఆర్ఎస్ వారికి మ‌ధ్య తోపులాట జ‌రిగింది. వ‌చ్చే వేస‌వికి తాగునీరు ఇవ్వ‌డం కోసం… ఇపుడు రైతుల పంట‌ల‌కు నీళ్లు వ‌ద‌ల‌క‌పోవ‌డం దుర్మార్గం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టారు. అస‌లు జూరాల ప్రాజెక్టు క‌ట్టిందే… ఆయ‌క‌ట్ట సాగుకోసం అని ఆయ‌న గుర్తుచేశారు.

మ‌రోవైపు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ కూడా ఈ విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రిని విమ‌ర్శించారు. త‌క్ష‌ణ‌మే జూరాల ఆయ‌క‌ట్టు రైతాంగానికి సాగునీరు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో మంచినీరు ఇవ్వ‌డం కోసం… పంట‌ల‌ను ఎండ‌పెట్టాలా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేస‌విలో స‌మ‌స్య ఉంటే… పొరుగునే క‌ర్ణాట‌క రాష్ట్రంతో మాట్లాడుకోవ‌చ్చ‌ని.. అక్క‌డా కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉంద‌ని ఎంపీ అన్నారు. రైతుల ఆందోళ‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.