(మెట్రో న్యూస్):
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లె గ్రామ అభివృద్ధిలో దగ్గు బ్రదర్స్.. అన్న దగ్గు కోటేశ్వర్ రావు(కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి) తమ్ముడు వెంకటేశ్వర్ రావు మాజీ సర్పంచ్ తమ వంతు ఆర్థిక విరాళాలతో గ్రామ అభివృద్ధిలో ముందుకు వెళ్లడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.గత సర్పంచి ఎన్నికల్లో తమ్ముడు దగ్గు సంధ్య వెంకటేశ్వర్ రావు ఎన్నికల పోటీ సందర్భంగా లక్షల విలువ చేసే పది గుంటల భూమిని బతకమ్మ స్థలం కు కేటాయించగా.. అన్న కోటేశ్వర్ రావు ప్రభుత్వ నిధులు మంజూరైన సరిపోక పూర్తి కాకపోవడంతో తమ వంతు సహాయంగా గ్రామంలో పోచమ్మ గుడి ఆలయానికి రూ 13 లక్షలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య సబ్ సెంటర్కు మరో రు.3 లక్షలు సొంతంగా వెచ్చించి పూర్తి కావడంతో రంగయ్య పల్లె వాసులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ పాలనలో సర్పంచిగా ఉన్న సంధ్యా వెంకటేశ్వర్ రావు లు గ్రామంలో వైద్య సబ్ సెంటర్కు దాత గుర్రాల వెంకటరెడ్డి స్థలం ఇవ్వగా ప్రభుత్వ నిధులతో భవన నిర్మాణం చేపట్టిన నిధులు సరిపోకపోవడంతో అన్న కోటేశ్వర్ రావు ముందుకు వచ్చి మరో రూ.3 లక్షలు సొంతంగా కేటాయించి సబ్ సెంటర్ పూర్తి చేయడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
అలాగే ప్రస్తుత భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రంగయ్య పల్లెలో పోచమ్మ గుడి ఆలయ నిర్మాణానికి రూ 12 లక్షల కేటాయించగా. అన్న కోటేశ్వర్ రావు కాంట్రాక్టు చేపట్టి మరో రు 13 లక్షలు సొంత ఖర్చులతో భక్తులకు సౌకర్యం ఉండేలా ఇటీవలనే పూర్తి చేశారు. రంగయ్య పల్లె గ్రామ అభివృద్ధిలో దగ్గు బ్రదర్స్ లో వెంకటేశ్వర్ రావు గ్రామంలో అంతర్గత వీధుల లో సీసీ రోడ్లను, ఆలయాన్ని పూర్తిచేసి ప్రజల మనలను పొందగా.. అన్న కోటేశ్వర్ రావు గ్రామ అభివృద్ధి ఆకాంక్షించి కన్న ఊరుకు ప్రజలకు ఉపయోగపడేలా తన వంతు సహాయం గా ముందుకు వచ్చి పోచమ్మ గుడి ఆలయంతో పాటు.. వైద్య సబ్ సెంటర్ పూర్తి చేయడంతో ప్రారంభానికి ముస్తాబయ్యాయి. దగ్గు బ్రదర్స్ గ్రామ అభివృద్ధిలో తమ వంతు సహాయంగా నిధులను అందించడంతో పాటు ప్రజలకు ఎప్పటికి అందుబాటులో ఉంటూ తోచిన సహాయం అందించడంలో దగ్గు బ్రదర్స్ ముందు ఉండడంతో గ్రామస్తులు యువకులు విద్యార్థులు అన్ని వర్గాల ప్రజల ఆధార అభిమానాలు పొందుతున్నారు. ఇటీవల కోటేశ్వర్ రావు తమ్ముడు వెంకటేశ్వర్ రావు తో కలిసి పూర్తి కావస్తున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను, సబ్ సెంటర్ ను సందర్శించి సంతోషం చెందారు. రంగయ్య పల్లెలో పూర్తయిన పోచమ్మ ఆలయ, వైద్య సబ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గండ్ర ను త్వరలో కలువలు ఉన్నట్లు దగ్గు బ్రదర్స్ తెలిపారు.