Take a fresh look at your lifestyle.

కొండా సురేఖ బర్తరఫ్‌పై బీసీ సమాజ్ తీవ్ర ఆగ్రహం

0 11

తెలంగాణ:రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఏకైక బీసీ మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండించింది. బీసీ మహిళా నాయకురాలిని మంత్రివర్గం నుంచి తొలగించడం అన్యాయమని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాలకు తగిన ప్రాధాన్యత, న్యాయం లభించడం లేదని ఆయన విమర్శించారు. “కాంగ్రెస్‌లో రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా?” అని ప్రశ్నించారు. బీసీ బిడ్డగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.