Take a fresh look at your lifestyle.

సుంకి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం.

0 8

మెట్రో న్యూస్ :

6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి.

మాజీ ఎమ్మెల్సీ, స్వర్గీయ సుంకి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి హాజరై జగదీశ్వర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి జగదీశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.