Take a fresh look at your lifestyle.

భూగర్భజలాల పరిరక్షణకు ప్ర‌త్యేక‌ నిధులు

0 5

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

క‌రవు ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లపై
మంత్రి ఉత్త‌మ్‌ స‌మీక్ష‌

భూగర్భజలాల పరిరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను అధ్యయనం చేసి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కరువు ఉపశమనం.. భూగర్భజల సంరక్షణపై మంత్రి ఉత్త‌మ్ అధ్య‌క్ష‌త‌న గురువారం నాడు స‌చివాల‌యంలో ప్రత్యేక సమీక్ష జ‌రిగింది. కరువు ఉపశమన చర్యలు, భూగర్భజల సంరక్షణ పనులకు కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై ఇందులో చర్చించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, నీటిపారుదల శాఖలు చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ రమేష్‌బాబు, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ దివ్య, భూగర్భజల శాఖ డైరెక్టర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, భూగర్భజలాల పరిరక్షణకు అవసరమైన బడ్జెట్ కేటాయిస్తాం అన్నారు. అవసరమైతే ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు మించి నిధులు సమకూరుస్తాం అని తెలిపారు. భూగర్భజల శాఖ పనితీరు, చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలన్నాఉ. అన్ని జిల్లాల భూగర్భజల శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలవారీగా భూగర్భజలాల స్థితిగతులను సమగ్రంగా సమీక్షించాలన్నారు. భూగర్భజల మట్టాలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయన్న వార్తలపై దృష్టి సారించాలని సూచన చేశారు. రాజస్థాన్‌లో చేపట్టిన భూగర్భజల పునరుద్ధరణ చర్యలను అధ్యయనం చేయాలని, మహారాష్ట్రలో అమలవుతున్న జల సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించాలని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.