హైదరాబాద్ (మెట్రో న్యూస్):
రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఉపయోగం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఢిల్లీకి సంచులు మోసే పార్టీ అయితే… బీజేపీ ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం నాడు శేరి లింగంపల్లి నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేశారని, రేవంత్ రెడ్డికి లొల్లి, కొవ్వు ఎక్కువ అని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. హైడ్రాతో ఎవరికి ఉపయోగం జరగలేదని, పైగా భూముల విలువ పడిపోయిందన్నారు. ఎర్రవెల్లిలో అమరవీరులకు ఇల్లు కట్టిస్తా అని సీఎం అంటున్నారు కదా, మియాపూర్‌లో ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి అనే సోయి లేదని కేటీఆర్ అన్నారు. సంవత్సరంలోగా కేసీఆర్ సీఎం కాబోతున్నారని కార్యకర్తల్లో జోష్ నింపారు.