Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ళిక మృతి…….

0 8

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

  • త‌ల్లికి ఉద్యోగం, ఇందిర‌మ్మ ఇళ్లు,
    రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా,
    రూ.1 కోటి బీమా
  • ప్ర‌క‌టించిన మంత్రి పొన్నం

ఓ ప్ర‌యాణికురాలు బ‌స్సులో నుంచి బ‌య‌ట‌కు నెట్టివేయ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌ణుగూరు బ‌స్సు కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ళిక మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. బుధ‌వారం మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వం మ‌రియు ఆర్టీసీ నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయలు ప్రమాదా భీమా అందజేయ‌నున్న‌ట్టు మంత్రి పొన్నం ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ కుటుంబ సభ్యురాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ సంఘటనకు కార‌ణ‌మైన ప్ర‌యాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తగిన విధంగా కఠినచర్యలు తీసుకుంటాం అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగొద్దు, ఒకవేళ మా సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ఉంటే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి త‌ప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవ‌ద్ద‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.