జీవో 76 అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన.. త్వరలోనే పట్టాల మంజూరు: అదనపు కలెక్టర్ రాములు
మెట్రో న్యూస్
ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఊరటనివ్వనుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీవో నంబర్ 76 కింద గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే ప్రస్తుతం పట్టాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాములు తెలిపారు.
బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని రిటైర్మెంట్ కాలనీలో తహసీల్దార్ సతీష్ కుమార్‌తో కలిసి పట్టాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దరఖాస్తు చేసుకున్నవారు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పట్టాల మంజూరు ప్రక్రియకు స్థానికులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అంజనీకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.