Take a fresh look at your lifestyle.

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి

0 12

ఎస్ఇ,పి, యాదగిరి

ఘనంగా విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

మెట్రో న్యూస్:

విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించామని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ పి, యాదగిరి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదు ను నమోదు చేసుకుని నేరుగా ఫిర్యాదుదారునికి సమాధానం తెలియజేస్తామని అన్నారు. ప్రస్తుత ఎల్ నినో ప్రభావం దృష్ట్యా విద్యుత్ ఎంతో విలువైందని ప్రతి ఒక్కరు విద్యుత్ ను పొదుపు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, విద్యుత్ ను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ప్రభుత్వ సహకారంతో నాణ్యమైన విద్యుత్ ను వినియోగదారులకు అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉండి సరఫరా చేస్తామని తెలిపారు. పలువురు వినియోగదారులు పాల్గొని కొత్తగా ట్రాన్స్ఫార్మర్ లు, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని, గృహాల్లో సమస్య ఉందని ఫిర్యాదులు అందజేశారని, సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ టెక్నికల్ ఇంజనీర్ ఆపరేషన్ సూర్యాపేట అధికారి వెంకటకృష్ణ, ఎస్ ఏఓ సత్యనారాయణ, ఏడిఇ శ్రీనివాస్, ఎ ఇలు, లైన్ మెన్ లు, సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.