ఎస్సై చలికంటి నరేష్
మెట్రో న్యూస్ (నవంబర్ 4) హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పోలీసులు ఆటో రాకపోకలు, నిలుపుదలపై కఠిన ఆంక్షలు విధించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని హుజూర్ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ చలికంటి నరేష్ హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ… పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి ఆటో అడ్డాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.
అలాగే పాత బస్టాండ్ పరిసరాల్లో ప్రమాదాలు, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని ఆటో డ్రైవర్లు, ఆటోల పూర్తి వివరాలను సేకరించి, ప్రతి ఆటోకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్లందరూ పోలీసులకు పూర్తిగా సహకరించి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.