Take a fresh look at your lifestyle.

చేతికొచ్చిన పంట నేలపాలు

0 7

ఎల్నినో ప్రభావంతో అరకొరగా పండిన పంట కూడా ఆగం

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

మెట్రో న్యూస్,( నవంబర్ 4) పాలకీడు

ఎల్మినో ప్రభావం వల్ల తీవ్ర కరువు మండలంగా ప్రకటించబడిన పాలకీడు మండలంలో అరకొరగా పండినపంట సైతం చేతికిఅందేలా లేదని రైతులు వాపోయారు.
ఇటీవల వరసగా సంభవించిన అర్నాబ్,మురుసు తుఫానులు మండల రైతులను కుదేలు చేశాయి.బారి వర్షాలు,ఈదురు గాలుల దాటికి చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది.ఆరుగాలం కష్టపడి పండించి పంట అమ్ముకుని. పెట్టుబడులు,అప్పులు కట్టుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. కింద పడిన పంట పూర్తిగా ఆగమైందని,మిల్లర్లు మంచి ధరపెట్టి కొనే పరిస్థితి లేదాని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.పాలకీడు మండలం గుండెబోయినగూడెం గ్రామానికి చెందిన యాతం వసంత నాయుడు అనే యువ రైతు తన స్వంత పొలంలో వరి సాగు చేయగా నిన్నటి మురుసు తుఫాన్ నిండా ముంచిందని ఆందోళన చెందారు. కింద పడిన పంట సగం కూడా చేతికొచ్చేలా లేదని విచారం వ్యక్తం చేశారు. పెరిగిన ఎరువుల ధరలు ,నాటు కూలీలు చూసుకుంటే నష్టమే వాటిల్లుతుందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.