మెట్రో న్యూస్
-పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
భారత మాజీ ప్రధాని భారత ఉక్కు మహిళ, శ్రీమతి ఇందిరా గాంధీ గారి 42వ వర్ధంతి వేడుకలు నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి..
ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ .
ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం తమ జీవితాన్ని ధారపోసిన మహోన్నత నాయకురాలు ఇందిరమ్మను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. దేశాన్ని అఖండ భారతంగా మార్చిన ఉక్కు మనిషి, దేశ సమైక్యత కోసం తన రక్తాన్ని సైతం ధారపోసిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ అని కొనియాడారు, గరీబీ హటావో నినాదంతో పేదరిక నిర్మూలనకు ఇందిరమ్మ చేసిన కృషి, బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణలు లాంటి విప్లవాత్మక నిర్ణయాలు దేశ సామాజిక, ఆర్థిక పునాదులను పటిష్టం చేశాయని గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం అసువులు బాసిన ఇందిరమ్మ త్యాగం యావత్ దేశానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, ములుకల వినోద సాంబయ్య, కాంపెల్లి వీణ విజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎర్ర యాకూబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్, మాజీ ప్రజా ప్రతినిధులు కాట ప్రభాకర్, పేరం బాబురావు, రామగొని సుధాకర్ గౌడ్,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, 9వ వార్డు అధ్యక్షుడు మేరుగు కిరణ్ యాదవ్, 25వ వార్డు అధ్యక్షుడు మహాదేవుని రాజ్ వీర్, 25వ వార్డు యూత్ అధ్యక్షుడు కాట అఖిల్, వేముల నవీన్ గౌడ్, గుడికందుల సదానందం, కీసరి రాజీవ్, ముదరబోయిన రాజు, పొలబోయిన ప్రణయ్, నల్గొండ వంశీ, కొలువుల స్వామి, దేశి సాయి పటేల్, కొలువుల పవన్, చీకటి శివమణి, అందే రంజిత్, తదితరులు పాల్గొన్నారు..