Take a fresh look at your lifestyle.

సాగు భూమి సంరక్షణ కార్యక్రమం రబీ పంటల పైన ఎలానో ప్రభావ అవగాహన సదస్సు

0 6

మెట్రో ఈవినింగ్ న్యూస్

వరంగల్ మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ యాసంగిలో నీటి తక్కువ అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను రైతులు ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భ జలాల లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున రబీ పంటల సాగు ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని తెలిపారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పెసర, మినుము, కంది, అలసంద, శనగ వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. వేరుశనగ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి నూనెగింజల పంటలకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. వర్షాధార ప్రాంతాల్లో తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకొని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు.జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం మాట్లాడుతూ రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని, నీటి లభ్యతను బట్టి సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భూసార పరిరక్షణకు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను వినియోగించాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి నేలలో తేమను కాపాడుకోవాలని తెలిపారు. సాగు ఖర్చులను తగ్గించుకొని అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించాలని పేర్కొన్నారు.
వర్ధన్నపేట డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి నర్సింగ్గం మాట్లాడుతూ రైతులందరూ కూడా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించినారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలని చెప్పినారు.
ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ రైతులందరూ కూడా నేలల ఆరోగ్యాన్ని కాపాడుతూ శాస్త్రవేత్తలు సూచించినటువంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ఈ యాసంగిలో వేసుకోవాలని తెలిపినారు.
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎల్ నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో పండే కూరగాయల సాగు గురించి వివరించినారు.
వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ భూసార ఆరోగ్య కార్డుల్లో సూచించిన వివరాల ఆధారంగా రైతులు సమతుల్య ఎరువులను వినియోగించాలని సూచించారు. నేల సారాన్ని కాపాడుకుంటూ సాగు ఖర్చులను తగ్గించి, మెరుగైన దిగుబడులు సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య, జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, మండల ప్రత్యేక అధికారి నరసింహమూర్తి, తాసిల్దార్ శ్రీకాంత్, విద్యుత్ శాఖ ఏఈ రాజు, నీటిపారుదల శాఖ ఏఈ జ్యోతి, పశుసంవర్ధక శాఖ అధికారి శృతి, ఉద్యానవన శాఖ అధికారి మానస, వ్యవసాయ సహాయ సంచాలకులు జి నర్సింగం, మండల వ్యవసాయ శాఖ అధికారులు, పిఎసిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మామునూరు సిఐ జె. సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.