తెలంగాణలో బియ్యం ధరలు చూసి జనం బేజారెత్తిపోతున్నరు. ఆకాశన్నంటిన ధరలతో కొనలేక, వంట చేయలేక పస్తులుంటున్నారు. రైస్ మాఫియా ప్రభుత్వ అసమర్దతను ఆసరా చేసుకొని ఎల్ నినో పేరిట కృత్రిమ కొరత సృష్టించి, బియ్యం నిల్వ ఉంచి ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కిలో బియ్యం రూ.95, 25 కిలోల బ్యాగ్ రూ.2,700కు పెంచి అందిన కాడికి దోచుకుంటున్నారు.
రైస్ మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్టవేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను దోచుకుంటున్న బియ్యం మాఫియా అక్రమాలను అడ్డుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. సాగుకు నీళ్లు, కరెంట్ ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని చర్చించుకుంటున్నారు.