Take a fresh look at your lifestyle.

రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలి: ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్

0 3

( మెట్రో న్యూస్ )

ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురువక భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతుందని అన్నారు. త్రాగు నీటికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కావున రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.