Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును వివరించిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి

0 4

( మెట్రో న్యూస్ )

ఆర్ముర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. సిఐ చంద్ర శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాల విద్యార్థులు.ఈ కార్యక్రమంలో, పోలీసు సిబ్బంది పోలీస్ స్టేషన్ పనితీరును వివరించడంతో పాటు, రిసెప్షన్ డెస్క్ నుండి మొదలుకొని వివిధ పోలీస్ విభాగాల వరకు విద్యార్థులకు పరిచయం చేశారు. వివిధ పోలీసు సిబ్బంది పాత్రలు మరియు బాధ్యతలు, పోలీసు సేవలు, ఇంకా పోలీస్ స్టేషన్‌లో జరిగే రోజువారీ కార్యకలాపాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, విద్యార్థులలో పోలీసు శాఖ పనితీరు గురించి అవగాహన కల్పించడం, పోలీసు సేవలపై అవగాహనను పెంపొందించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం యొక్క ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేయడం.

Leave A Reply

Your email address will not be published.