( మెట్రో న్యూస్ )
మాల సంఘాల జెఎసి నిజామాబాద్ జిల్లా చైర్మెన్ గా నందిపేట మండలం వన్నెల్ (కే) కు చెందిన బండి రవీందర్ ను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జెఎసి చైర్మన్ మందాల భాస్కర్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఆయన ఈ మేరకు ఆర్మూర్ లో మాల సంఘాల జెఎసి జిల్లా చైర్మెన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. మాలలను ఐక్యం చేసి ఉద్యమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మలాల చైతన్య కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని అన్నారు. జిల్లాలో అన్ని మాల సంఘాలు, యువజన, విద్యార్థులు సంఘాలు కలిసి పని చేయాలని కోరారు. అన్ని వర్గాల మాలలు కలిసి రావాలని కోరారు. జిల్లా చైర్మెన్ గా ఎన్నిక అయిన బండి రవీందర్ మాట్లాడుతూ జిల్లా చైర్మెన్ గా తన బాధ్యతను తప్పకుండా నిర్వహిస్తానని అన్నారు. అందుకు మాలలలు కలిసి రావాలి కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జెఎసి నేతలు రాహుల్, లింగన్న, సంజీవ్ లు పాల్గొన్నారు….