Take a fresh look at your lifestyle.

ఊకల్‌లో బీఆర్ఎస్‌లోకి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు

0 10

(మెట్రో న్యూస్)

గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దబోయిన సుధాకర్, కాంగ్రెస్ నాయకుడు వల్లపు ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులకు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఊకల్ గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పార్టీ ఇన్‌చార్జులు, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, ఊకల్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.