నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల పరిధిలో గల పాతాళ గంగ లోని శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ ఎల్ బి సి సారంగం పనులను టీపీఎస్సీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటలతో కలిసి పరిశీలించారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలోని షియర్ జోన్‌ను దాటిన తవ్వకాలు ఐదారు నెలల్లో సుమారు 700 మీటర్ల పురోగతి అదనపు యంత్రాలు, జర్మనీ నుంచి వచ్చే లోకోమోటివ్‌తో పనుల వేగం పెంపు.2028 జూన్ నాటికి నీటి సరఫరా లక్ష్యం.
కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం.2028 జూన్ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగం పనులు సుమారు 79 శాతం పూర్తయ్యాయని, మరో 9.1 కిమీల మేర తవ్వకాలు మిగిలున్నాయని అధికారులు వివరించారు.
త్వరలోనే పనులు పూర్తి చేసి త్రాగు సాగునీటి నీటిని వినియోగించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇంజనీర్లు, పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post