Take a fresh look at your lifestyle.

US Planes: జోర్డాన్‌పై దాడిలో ప‌లు అమెరికా విమానాలు ధ్వంసం !

0 5

టెహ్రాన్‌: జోర్డాన్‌లో ఉన్న ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జ‌రిపిన దాడిలో ప‌లు అమెరికా విమానాలు(US Planes) ధ్వంసం అయిన‌ట్లు ఓ నివేదిక రిలీజైంది. ఏ-10 థండ‌ర్‌బోల్ట్‌.. వార్తాగ్ విమానాన్ని పేల్చేశారు. దాని రెక్క మిస్సైన‌ట్లు గుర్తించారు. ఇక మ‌రో ఎఫ్‌-15 యుద్ధ విమానాలు 8 వ‌ర‌కు డ్యామేజ్ అయిన‌ట్లు రిపోర్టులో తెలిపారు. మువాఫ‌క్ సాల్తీ ఎయిర్ బేస్‌పై జ‌రిగిన దాడిలో ఆ న‌ష్టం జ‌రిగింది. ఇరానీ దాడుల‌ను తిప్పికొట్టేందుకు జోర్డాన్‌లోని అమెరికా ద‌ళాలు సుమారు 30 పేట్రియాట్ క్షిప‌ణుల‌ను ఫైర్ చేసిన‌ట్లు తెలిసింది. 5 ఇరానీ ట్యాంక‌ర్ల‌ను పేల్చిన ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా ఇరాన్ దాడుల‌కు దిగింది. జోర్దాన్‌లో ఉన్న బేస్‌తో పాటు 8 ట్యంక‌ర్లు, రెండు యుద్ధ నౌక‌ల‌పై దాడి చేసిన‌ట్లు ఐఆర్జీసీ తెలిపింది. మువాఫ‌క్ సాల్తీ ఎయిర్ బేస్ నుంచి అమెరికా అనేక యుద్ధ విమానాల‌ను ఆప‌రేట్ చేస్తున్న‌ది.

Leave A Reply

Your email address will not be published.