Take a fresh look at your lifestyle.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

0 8

మెట్రో న్యూస్.

పలు గ్రామాల్లో అంగన్వాడీ, మహిళా సమాఖ్య భవనాలకు శ్రీకారం.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

గణపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంగన్వాడీ, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. చెల్పూర్ గ్రామంలో రూ.20 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, మహిళా సమైక్య భవనాలకు రెండు చోట్ల రూ.10 లక్షల చొప్పున శంకుస్థాపన చేశారు. లక్ష్మారెడ్డిపల్లిలో రూ.10 లక్షలు, కరకపల్లిలో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గాంధీనగర్‌లో రూ.20 లక్షలతో అంగన్వాడీ భవనం, గణపురం మండల కేంద్రంలో మూడు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.60 లక్షలు, బుర్రకాయలగూడెంలో మహిళా సంఘం భవనానికి రూ.10 లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు మహిళలు, చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.