తిరుమల యాత్ర అంటే కేవలం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనమే అని చాలామంది భావిస్తారు. కానీ తిరుమల క్షేత్ర ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని లోతుగా పరిశీలిస్తే, శ్రీవారి దర్శనానికి ముందుగా శ్రీ భూవరాహస్వామివారిని దర్శించుకోవాలనే నియమం ఉందనే విషయం స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు; తిరుమల క్షేత్ర మహత్యంతో మరియు క్షేత్ర పురాణంతో ముడిపడిన అత్యంత విశిష్టమైన సాంప్రదాయిక విధి.వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణాల ప్రకారం తిరుమలగిరి అసలు పేరు శ్రీ ఆదివరాహక్షేత్రం. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారు వైకుంఠం నుండి భూలోకానికి వేంచేసి, తిరుమలలో కొలువుదీరక ముందే శ్రీ వరాహస్వామివారు ఇక్కడ నివసిస్తున్నారు. సముద్రంలో మునిగిపోయిన భూదేవిని ఉద్ధరించిన అనంతరం, వరాహ మÖర్తి ఈ పుణ్యగిరిపై వేంచేశారు.
ఆ తర్వాత శ్రీనివాసుడు భూలోకానికి వచ్చినప్పుడు, తనకు నివాసయోగ్యమైన స్థలం కేటాయిం చమని వరాహస్వామి వారిని ప్రార్థించారు. అందుకు వరాహస్వామివారు ఒక షరతుపై స్థలాన్ని ప్రసాదించారు. దాని ప్రకారం, తిరుమలకు వచ్చే భక్తులు మొదట శ్రీ వరాహస్వామి వారిని దర్శించి, ఆ తదుపరి స్వామివారికి సమర్పించే నైవేద్యం మరియు పూజాఫలాల్లో మొదటి భాగం వరాహస్వామివారికే చెందాలి.ఈ క్షేత్ర ఒప్పందానికి కట్టుబడి, శ్రీ వేంకటేశ్వరస్వామివారు స్వయంగా వరాహస్వామివారికి మొదటి దర్శనం, మొదటి నైవేద్య ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
శ్రీవారి ఆలయానికి సమీపంలో, స్వామి పుష్కరిణి వాయవ్య కోణంలో ఉన్న శ్రీ భూవరాహస్వామివారి ఆలయాన్ని దర్శించకుండా చేసే తిరుమల యాత్ర అసంపూర్ణమని, ముందుగా వరాహమÖర్తి అనుగ్రహం పొందినప్పుడే శ్రీవారి దర్శన ఫలం సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడే ఈ పవిత్రమైన ఆచారం వెనుక ఉన్న మ న్నతమైన సందేశం నిగూఢమై ఉంది. మనం ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఉండే పూర్వాధికారాన్ని, ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, మనకంటే ముందుగా అక్కడ కొలువైన దైవాన్ని ఆమోదించి గౌరవించడం భారతీయ సంస్క ృతి ప్రతిపాదించే వినయానికి మరియు ధర్మానికి ప్రత్యక్ష ప్రతీక. పరమాత్మయైన శ్రీనివాసుడు సైతం ఆదిదేవుడైన వరాహమÖర్తికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి, లోకానికి ఈ ధర్మాన్ని స్వయంగా ఆచరించి చూపించారు.
“నేను నేరుగా ప్రధాన ఆలయానికే వెళ్తాను” అనే అహంకారపూరితమైన ఆతురతకు స్వస్తి చెప్పి, “ఈ పవిత్ర భూమికి ఆద్యదైవం ఎవరు?” అని తెలుసుకుని, ఆధ్యాత్మిక క్రమాన్ని పాటిస్తూ ఆయనను ముందుగా నమస్కరించడం మానవ అహంకారాన్ని తొలగించి, నిజమైన భక్తిలోని వినయాన్ని, క్రమశిక్షణను వెలికితీస్తుంది.
ఇక్కడ శ్రీ స్వామి పుష్కరిణికి కూడా అత్యంత పవిత్రమైన, విశిష్టమైన స్థానం ఉంది. క్షేత్ర ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం భక్తులు మొదట పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, అనంతరం శ్రీ భూవరాహస్వామిని దర్శించుకుని, ఆ తర్వాత మాత్రమే శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వెళ్లాలనే శాస్తక్తమైన విధివిధానం నిర్దేశించబడింది.
అయితే ప్రస్తుత కాలంలో యాత్రికుల రద్దీ, సౌకర్యాల దృష్ట్యా ప్రళన లేదా నమస్కారంతో మమ అనిపించినప్పటికీ, ప్రధానమైన పరమార్ధం మాత్రం ఆదిదేవుడైన వరాహస్వామి దర్శనానికి ముందస్తు ప్రాధాన్యతను ఇవ్వడంలోనే నిహితమై ఉంది. శ్రీనివాసుని దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా వరాహమÖర్తిని దర్శించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఏర్పాట్లను సమన్వయం చేస్తోంది.నినిఈ దివ్య సంప్రదాయం మానవ జీవితానికి మరొక మ న్నతమైన పాఠాన్ని బోధిస్తుంది. మన లక్ష్యం లేదా గమ్యం ఎంత ఉన్నతమైనదైనా, ఆ గమ్యానికి పునాదిగా నిలిచిన వారిని, మనకు దారి చూపిన పూర్వీకులను ఎన్నటికీ మరచిపోకూడదు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వరుని కృపాకటాల కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు.
కానీ ఆ శ్రీవారి దివ్య దర్శనానికి పూర్వమే వరాహస్వామిని దర్శించి స్మరించుకోవడం ద్వారా భక్తుడు తన హృదయంలో కృతజ్ఞత, వినయం, క్షేత్ర మర్యాద అనే మÖడు మ న్నతమైన జీవిత మÖల్యాలను మేల్కొలుపుకుంటాడు.నినిఅందుకే తిరుమల వెళ్లినప్పుడు వరాహస్వామిని ముందుగా దర్శించుకోవడం ఒక “ఆచారం పూర్తి చేయడం”గా కాకుండా, క్షేత్ర చరిత్రకు నమస్కరించి, కృతజ్ఞతతో అడుగులు ముందుకు వేయడంగా భావిస్తే ఆ దర్శనానుభూతి మరింత అర్థవంతమవుతుంది.నినిముందుగా వరాహస్వామి.. అనంతరం వేంకటేశ్వరస్వామి ఇది కేవలం దర్శన క్రమం కాదు; వినయం నుంచి భక్తికి, జ్ఞానం నుంచి ఆనందానికి సాగే తిరుమల ఆధ్యాత్మిక ప్రయాణం.