Take a fresh look at your lifestyle.

మార్చాల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన,జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,

0 2

(మెట్రో న్యూస్)

కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామంలోని,ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించి,పాఠశాల వాతావరణాన్ని పరిశీలించి,అక్కడి విద్యా ప్రమాణాలు,విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు,పాఠశాలలో అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అమలు తీరుపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధతో బోధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 54 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడంతో,ప్రస్తుతం మొత్తం 106 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే, ఈ పాఠశాలలో చదివిన ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు వివరించారు.స్థానిక పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుండటంతో విద్యార్థులు ఇక్కడే చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని,విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు ఆకుకూరలను కిచెన్ గార్డెన్ ద్వారా పండించిన ఆకుకూరలను ఉపయోగిస్తున్నట్లు, దాతల సహకారంతో విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు సహకారంతో షెడ్‌ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యా వాతావరణాన్ని,విద్యార్థుల అభ్యసన పురోగతిని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు.జిల్లా కలెక్టర్ వెంట సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి,, ఎమ్మార్వో ఇబ్రహీం,ఎంపీడీవో యాదయ్య,మార్చాలా పంచాయతీ సెక్రెటరీ రమేష్,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.