Take a fresh look at your lifestyle.

హరీశ్ రావు భూ దోపిడీకి పాల్పడ్డాడు అందరి చిట్టా విప్పుతాము అసెంబ్లీలో మంత్రి పొంగులేటి చిట్ చాట్

0 3

హైదరాబాద్ (మెట్రో న్యూస్):

బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు భూ దోపిడీకి పాల్పడ్డాడని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసైన్డ్ భూమికి ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తప్పే కదా అని ప్రశ్నించారు. ఆ విషయం నీకు తెలీయదా… హరీశ్ రావు… ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నావని అడిగారు. నీ బుద్ధి ఎక్కడ పోయింది హరీశ్ రావు అంటూ మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మంత్రి పొంగులేటి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రస్తావిస్తూ.. భూధాన్ భూమిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫేక్ ఎన్ఓసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది కూడా తప్పే..! మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హై కోర్టు, సుప్రీం కోర్టు స్టేటస్ కో ఉన్న కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ప్రభుత్వ భూమి ఏ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినా తప్పే.. అసలు 22ఏ కింద పట్టా భూమి నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే ఉంది… మిగతాదంతా ప్రభుత్వ భూమేనని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇంకా 40 వేల ఎకరాల భూమి 22ఆ లో తగ్గిందన్నారు. అందరి చిట్టా విప్పుతామన్నారు. 22ఏ విషయంలో చాలా కీలక నిర్ణయాలు ఉంటాయని పొంగులేటి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.