Take a fresh look at your lifestyle.

మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్.

0 21

మెట్రో న్యూస్.

ప్రభుత్వ ఆదేశాల మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్మేరకు 2026- 27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ మార్కెటింగ్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.
2026- 27 పత్తి మద్దతు ధర సేకరణపై బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ ఖరీఫ్ లో జిల్లాలో సుమారు 5 లక్షల 93,795 ఎకరాలలో పత్తి సాగు అవ్వగా, 3 లక్షల 56 వేల 257 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారు లు సమర్పించడం జరిగిందని, అందుకు తగ్గట్టుగా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పత్తి కొనుగోలుకు జిల్లాలో 26 జిన్నింగ్ మిల్లులు ఉండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 10 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి సిసిఐ ద్వారా క్వింటాలుకు 8667 /- రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. తేమశాతం 8 వరకు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందని తెలిపారు.
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా కిసాన్ కపాస్ యాప్ ,అలాగే పత్తి మద్దతు ధర పొందేందుకు నాణ్యత ప్రమాణాల పై విస్తృత ప్రచారం కల్పించాలని, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా పత్తి పండించిన ప్రతి రైతుకు పై విషయాలతో పాటు, పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, పత్తిని కొనుగోలు చేసే రోజులు, సెలవు రోజుల వివరాలన్నింటినీ ముందుగానే తెలియజేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ముందుగానే నెల రోజుల షెడ్యూల్ ను, అలాగే మద్దతు ధర వివరాలు, తేమశాతం తదితర వివరాలన్నింటినీ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు . జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి ప్రైవేట్ గా పత్తిని కొనుగోలు చేసి రైతులకు లాభం చేకూర్చాలని, ఎల్ నినో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో రైతులకు సహకరించాలని, అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ కోరారు.
అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా టాయిలెట్లు, తాగునీరు, రైతులు వేచి ఉండేందుకు నీడ, అవసరమైతే రాత్రి సమయంలో గడిపేందుకు వసతి, మైకు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద పోలీస్ పికటింగ్ ,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పత్తి అమ్మిన రైతులకు తక్షణమే చెల్లింపులు చేసేలా సిసిఐ అధికారులు చర్యలు తీసుకోవాలని, పత్తి కొనుగోలు ముగిసే వరకు మార్కెటింగ్ శాఖ సెక్రెటరీలు, సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయడం జరగదని కలెక్టర్ వెల్లడించారు. కపస్ కిసాన్ ఆప్ ,పత్తి కొనుగోలు నాణ్యత ప్రమాణాలపై ఈనెల 8న జిల్లాలోని ఏఈఓ లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు . పత్తి కొనుగోలు కేంద్రాలలో సీసీఐతో పాటు, జిన్నింగ్ మిల్ యజమానులు తేమశాతం వచ్చిన వెంటనే పత్తిని కొనుగోలు చేసేలా చూడాలని ,ఈ సంవత్సరం ఎల్ నినోవల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా తేమతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రతి రెండు రోజులకు ఒకసారి తేమను తనిఖీ చేసేలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.