(మెట్రో న్యూస్)
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు. రామకృష్ణాపూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల ప్రయోజనాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. క్యాతనపల్లిలో రూ.100 కోట్లతో తాగునీటి పనులు చేపట్టడంతోపాటు రహదారులు, మురుగు కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు మంతెన మల్లమ్మ, దాముక శిరీష, గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, కూతురు ప్రభాకర్, మాజీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, నాగుల రాజ్ కుమార్, బత్తుల శ్రీనివాస్, మంద సృజన, మేకల సురేందర్, బత్తుల వేణు, నక్క శ్రీనివాస్, బొద్దుల ప్రేమ్ సాగర్, దాముక రమేష్, కనుకుంట్ల కనకయ్య, కుదిరే రామస్వామి, జాలిగపు రాజేశ్వరి, దీప, అనూష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.