
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావుకు పార్టీ మహిళా నేతలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ కేసీఆర్ నివాసానికి వెళ్లి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గులాబీ బాస్… వారిద్దరినీ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు. వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళా నేతలిద్దరినీ కేసీఆర్ దంపతులు చీర సారెతో సత్కరించి దీవించారు.