Take a fresh look at your lifestyle.

పండుగ సాయన్న స్ఫూర్తితో ముందుకు సాగాలి.

0 9

(మెట్రో న్యూస్):

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.నాగర్ కర్నూల్ లోని కేసరి సముద్రం ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ స్థాపనకు మంగళవారం శంకుస్థాపన చేశారు.మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ బిడ్డ అయిన పండుగ సాయన్న బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముదిరాజులకు,బడుగు బలహీన వర్గాలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని,నాగర్ కర్నూల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని,ఆవిష్కరణకు ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తామని తెలిపారు.మత్స్యకారుల సంఘానికి అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర,వైస్ చైర్మన్ బాదం రమేష్,మత్స్యకార సంఘం నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.