హైదరాబాద్ : మెట్రో న్యూస్
కెసిఆర్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది.ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. కెసిఆర్ 1000 రోజులుగా ఫామ్‌హౌస్‌లో నే ఉన్నాడని అందువల్ల ఆయనకు ఆ పదవిలో ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కెసిఆర్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రజలకు జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్‌హౌస్‌లో నిద్రపోతూ రూ. 1 కోటి 32 లక్షల జీతం ఇప్పటి వరకు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం ప్రజాధనం రూ. 21 కోట్లు వృథా అవుతుందని ఆయన పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదన్నారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రోహిత్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిత్ లు పాల్గొన్నారు.