పారా ఆర్చరీలో శీతల్ దేవి సంచలనాలు సృష్టిస్తున్నది. జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో ఆమె రెండో స్వర్ణం గెలిచింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లోనూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది. దీంతో ఈ గేమ్స్‌లో మొత్తం మూడు పతకాలు ఆమె ఖాతాలో పడ్డాయి.
శీతల్ దేవికి చేతులు లేవు. కానీ ఆమె ఆర్చరీలో దిట్ట. ఇండియన్ ఆర్చర్ శీతల్ దేవి ఏషియన్ పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం గెలిచింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకున్నది. ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో ఆమె సింగపూర్ అథ్లెట్ ఆలిమ్ నుర్ స్యాహిదాను ఓడించింది. తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచిన కొన్ని గంటల వ్యవధిలోనూ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో శీతల్ దేవి అద్భుత ప్రదర్శన ఇచ్చి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. 19 ఏళ్ల వరల్డ్ చాంపియన్ శీతల్ దేవి 142-139 స్కోరుతో ఆలిమ్పై విజయం సాధించింది. 2023 హాంగ్జూ గేమ్స్‌లోనూ ఆమె ఆలిమ్పైనే విక్టరీ కొట్టింది. ప్రస్తుత పారా గేమ్స్‌లో శీతల్ దేవి ఖాతాలో మొత్తం మూడు పతకాలు ఉన్నాయి. మహిళల డబుల్స్ సిల్వర్ కూడా గెలిచిందామె.