మెట్రో న్యూస్.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదులో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్సీ కేదావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం లో జరిగిన నల్లగొండ నియోజక వర్గస్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ,ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మంత్రులు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారు.రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎల్ నీనో తో అంతటా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలన్నారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు.పార్టీ కార్యకర్తలకు, పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నారని నల్గొండ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు.ఈ సమావేశంలో నల్గొండ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.