(మెట్రో న్యూస్):
భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జీ. కాలనీలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మాజీ వార్డు సభ్యురాలు సరిత నివాసంలో నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓల్డ్ ఎం.ఐ.జీ. కాలనీలో ఫోర్త్ బ్యాచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, దేవి నవరాత్రులు చెడుపై మంచి సాధించిన విజయానికి, స్త్రీశక్తి వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధించడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.నవరాత్రి ఉత్సవాలు కాలనీవాసుల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులకు, కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.