Take a fresh look at your lifestyle.

సూప‌రింటెండెంట్ ల‌క్ష్మీ భాస్క‌ర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

0 21

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

ఏసీబీ వ‌ల‌కు నిమ్స్ వైద్యుడు, అడిష‌న‌ల్ సూప‌రింటెండెంట్ ల‌క్ష్మీ భాస్క‌ర్ చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై మంగ‌ళ‌వారం ఏసీబీ ఆయ‌న నివాసంలో సోదాలు నిర్వ‌హించింది. ల‌క్ష్మీ భాస్క‌ర్ ఆసుప‌త్రి కార్యాల‌యంలోనూ, ఆయ‌న నివాసంలోనూ ఏసీబీ బృందాలు త‌నిఖీలు చేప‌ట్టాయి. బంధు, మిత్రులు, డ్రైవ‌ర్ ఇండ్ల‌తోపాటు మొత్తం 12 చోట్ల సోదాలు చేప‌ట్టారు. సోదాల‌లో కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు ల‌భించాయ‌ని తెలుస్తోంది. అయిదేళ్లుగా ఈ బాధ్య‌త‌ల్లో ఉన్న ల‌క్ష్మీ భాస్క‌ర్‌పై క‌రోనా స‌మ‌యంలోనూ ప‌లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయంటున్నారు. మంత్రి పేషీ సిబ్బందితో స‌న్నిహితంగా ఉంటూ… అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డ్డార‌ని స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.